Bandi Sanjay: KCR క‌నిపించ‌ట్లేదు.. KTR మీదే అనుమానం

కొంత‌కాలంగా తెలంగాణ సీఎం KCR కనిపించడం లేదని త‌మ‌కు KTR పైనే అనుమానం ఉందని సెటైర్లు వేసారు BJP ఎంపీ బండి సంజయ్ (bandi sanjay). KCR 15 రోజులుగా కనిపించడంలేదని.. తమకు ఏదో అనుమానం కలుగుతోందని సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. “” KCRను KTR ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పెడుతుండా? ఎందుకంటే ఆయన KCR మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. KCR గారితో ప్రెస్మీట్ పెట్టించండి. అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతాం “” అని సంజ‌య్ అన్నారు.