Mahadev App: టాలీవుడ్, బాలీవుడ్ నటుల ద్వారా ఘరానా మోసం
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు (ranbir kapoor) ED నోటీసులు జారీ చేసింది. మహదేవ్ ఆన్లైన్ యాప్‌కు (mahadev app) రణ్‌బీర్ ప్రచారకర్తగా వ్యవహరించారని.. ఈ యాప్ ఒకే రోజు నాలుగు, ఐదు అప్లికేషన్లు రన్ చేసి రూ.200 కోట్లు లాభాలను అర్జించిందని ఈడీ ఆరోపిస్తోంది. కేవలం రణ్‌బీర్ కపూర్ మాత్రమే కాదు.. బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన నటీనటులు కూడా ఈ యాప్‌కు ప్రచారకర్తలుగా ఉన్నారు. వారందరికీ కూడా నోటీసులు పంపుతామని ఈడీ తెలిపింది.
అయితే ముందుగా రణ్‌బీర్ కపూర్‌ని మాత్రం ఈ శుక్రవారం విచారణకు రావాలని ఈడీ తెలిపింది. మహదేవ్ యాప్ కోసం రణ్‌బీర్ ప్రచారం చేసి కోట్లు తీసుకున్నారని పేర్కొంది. టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన 12 మంది నటులతో పాటు 100 మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ యాప్‌ని ప్రమోట్ చేసారు. ఈ యాప్‌కి చత్తీస్గడ్కి చెందిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ యాప్ యూఏఈలో ఉన్న హెడ్‌క్వార్టర్స్ నుంచి రన్ అవుతోంది. శ్రీలంక, నేపాల్‌లో కూడా ఈ యాప్‌కి సెంటర్లు ఉన్నాయి. (mahadev app)
ఈ యాప్ ద్వారా అక్రమంగా బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతూ.. యూజర్ల చేత కొత్త ఐడీలతో లాగిన్ చేయించి బినామీ ఖాతాలకు డబ్బులు అందేలా మోసాలకు పాల్పడుతోంది. ఇలాంటివి నాలుగు, ఐదు యాప్స్ రన్ చేస్తూ రోజుకు రూ.200 కోట్లు రాబడుతున్నారట. ఇప్పటివరకు ఈ యాప్‌కు సంబంధించి రూ.417 కోట్ల డబ్బును ఫ్రీజ్ చేసారు.