Chandrababu: బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు (chandrababu) తరఫు వేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు AP ACB కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. ఈ విచారణను రేపటికి వాయిదా వేసారు. రేపు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పూర్తవుతుంది. అయితే కోర్టులో AP CID తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వాదిస్తుండగా.. జడ్జి అసహనానికి గురయ్యారు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు అని మండిపడ్డారు. నేరానికి సంబంధించిన ఆధారాలుంటే చూపించాలని ఆదేశించారు.