Yarapathineni: YCPని వదిలినా.. మిమ్మల్ని అస్సలు వదలం
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో (ap elections) బరిలోకి రాముడు రావణాసురుడు దిగబోతున్నారని అన్నారు TDP నేత యరపతినేని శ్రీనివాసరావు (yarapathineni). ఎన్నికల్లో ఎక్కడ TDP గెలిచేస్తుందోనని అసలు పోటీ చేయనివ్వకూడదు అనే ఆలోచనలతో తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ అనే సంస్థ మొత్తం ఖరీదు రూ.300 కోట్లు అయితే రూ.2000 కోట్ల అవినీతి అని ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు.
“” ఏ నేరం చేయని మామీదే నువ్వు ఇన్ని కేసులు పెడితే.. ఇక మేం అధికారంలోకి వస్తే మీ మీద రోజుకి 100 కేసుల వరకు పెట్టగలం. రూ.3000 కోట్లతో అన్ని భవనాలకు రంగులు మార్పించావు. ఎవడబ్బ సొమ్ముతో వేయించావు. నీ సొమ్మా నీ బాబు సొమ్మా? 2024లో రాముడు లాంటి చంద్రబాబు నాయుడుకి రావణాసురుడు లాంటి జగన్‌కి మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఎవర్ని గెలిపించాలో ప్రజలకు బాగా తెలుసు. ఏమన్నా అంటే రోజా ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తున్నట్లు నటించి నేను ఆడదాన్ని అని మాట్లాడుతుంది.
మీ పేటీఎం బ్యాచ్ మా పార్టీలోని ఆడవాళ్లను, మా ఇంట్లోని ఆడవాళ్లను దరిద్రంగా తిడుతుంటే అది తప్పు కాదా? నువ్వు ఒక్కత్తివేనా ఆడదానివి. నీ వీడియోల గురించి ప్రత్యేకంగా మేం చెప్పేది ఏముంది? గూగుల్‌లో కొడితే అవే వస్తాయి. పోలీసులు కూడా జగన్ కోసమే పనిచేస్తున్నారు. మాపై దాడులు చేసి తిరిగి మామీదే కేసులు పెడుతున్నారు. ఇంకో నాలుగు నెలల్లో మేం అధికారంలోకి వచ్చాక మీకు ఉద్యోగాలు వద్దా? మాపై అక్రమ కేసులు పెట్టిన YCPని అయినా వదులుతామేమో కానీ వారి కోసం పనిచేసిన పోలీసులను మాత్రం అస్సలు వదలం “” అని వార్నింగ్ ఇచ్చారు యరపతినేని.