Ram Charan: స‌డెన్‌గా ముంబైకి చ‌ర‌ణ్.. కార‌ణ‌మిదేనా?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (ram charan) స‌డెన్‌గా ముంబై (mumbai) వెళ్లారు. ఏదైనా సినిమాకు సైన్ చేసారేమో అని అంతా అనుకున్నారు కానీ ఆయ‌న వెళ్లింది ఓ యాడ్ షూట్‌కి. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ అయ్య‌ప్ప దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఎక్కువ‌గా షూటింగ్స్‌లో పాల్గొన‌రు. రేప‌టితో చ‌ర‌ణ్ అయ్య‌ప్ప దీక్ష అయిపోతుంది. కాబ‌ట్టి యాడ్ షూట్ రేప‌టికి పోస్ట్‌పోన్ చేసారు. ఆ త‌ర్వాత శంక‌ర్ (shankar) డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న గేమ్ చేంజ‌ర్ (game changer) షూటింగ్‌లో కూడా చ‌ర‌ణ్ పాల్గొంటారు. ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2024 స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.