Tollywood Updates: మ‌నోళ్లు ఏం చేస్తున్నారంటే…

టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల‌కు సంబంధించి కొన్ని అప్డేట్లు వైర‌ల్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం (tollywood updates)

రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) నెక్ట్స్ సినిమాలో ఓ రేంజ్‌లో ఫైట్స్ ఉండ‌బోతున్నాయ‌ట‌. ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌భాస్ ఫైట్స్ చేసిన సినిమాలు ఏవీ రాలేదు. సలార్‌లో (salaar) ఫైట్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయ‌నుకోండి. అందుకే ఇప్పుడు ఆయ‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌లోనూ అదిరిపోయే ఫైట్స్‌ని ప్లాన్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఆయ‌న 2028లో చేయ‌బోయే సినిమా కోసం ఇప్ప‌టి నుంచే హీరోయిన్‌ను వెతికే ప‌నిలో ఉన్నార‌ట‌. ఈ సినిమాలో బ‌న్నీ ప‌క్క‌న ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను ప్లాన్ చేస్తున్నారు. (tollywood updates)

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) దేవర (devara) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈరోజు షెడ్యూల్ కోస‌మ‌ని తార‌క్ కారులో షూటింగ్‌కి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతార‌ట‌. అంటే సాధార‌ణంగా ఆయ‌న సాయంత్రం క‌ల్లా ఇంటికి వెళ్లిపోయేలా సీన్స్ ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ చేసింది లేద‌ట‌.

గుంటూరు కారం (guntur kaaram) త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళితో (rajamouli) క‌లిసి ఓ అడ్వెంచ‌ర‌స్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు రాజ‌మౌళి ప్రొడ్యూస‌ర్‌తో చెప్పిన‌ట్లు తెలుస్తోంది.