Chandrababu Naidu: సుప్రీంకోర్టు విచారణ సోమవారానికి వాయిదా
సుప్రీంకోర్టులో (supreme court) ఈరోజు జరగాల్సిన క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. TDP అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) అక్రమంగా పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చెల్లదని దానిని కొట్టేయాలని ఏపీ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను ఆ కోర్టు కొట్టేసింది. దాంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్లీ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోపక్క చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ అక్టోబర్ 5తో ముగియనుంది.