Nara Lokesh: ఏంటి ప్రశ్న‌లు అడ‌గ‌ట్లేదు.. క్లారిటీ వ‌చ్చేసిందా?

ఇక నుంచి జ‌గ‌న్ (jagan) పేరు సైకో జ‌గ‌న్ కాదు పిచ్చి జ‌గ‌న్ అని అన్నారు నారా లోకేష్‌ (nara lokesh). చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ నేప‌థ్యంలో ఈరోజు లోకేష్ నిరాహార దీక్ష చేప‌ట్టారు. దీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న దొంగ ప‌నులు అన్నీ ఆధారాల‌తో స‌హా బ‌య‌టపెడ‌తామని తెలిపారు. చంద్ర‌బాబు నాయుడికి ఎక్క‌డ బెయిల్ వ‌చ్చేస్తుందోన‌ని వ‌రుస‌గా మ‌రో రెండు కేసులు పెట్టార‌ని.. చ‌ట్ట‌మే త‌మ‌ను కాపాడుతుంద‌ని తెలిపారు. నారా లోకేష్ మాట్లాడాక మీడియాకు ఏమ‌న్నా ప్ర‌శ్న‌లు ఉంటే అడ‌గండి అని అడ‌గ్గా.. ఎవ్వ‌రూ ఏ ప్ర‌శ్న‌లు అడ‌గ‌లేదు. దాంతో లోకేష్‌.. ఏంటి మీడియా మిత్రుల ద‌గ్గ‌ర ప్ర‌శ్న‌లు ఏమీ లేవా? టీవీ 9 ఏమీ అడ‌గట్లేదేంటి? అని లోకేష్ అన‌గా.. ప‌క్క‌నే ఉన్న రామ్మోహ‌న్ నాయుడు అంద‌రికీ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లుంది అని పంచ్ వేసారు.