Annamalai: రామ్మా.. నా పక్కకి రా.. అన్నామలై ఓవరాక్షన్
తమిళనాడు BJP రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (annamalai) అధికారం ఉంది కదా అని తెగ రెచ్చిపోతున్నాడు. చిన్నా పెద్దా అని లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి తమిళనాడులో BJP AIADMK పొత్తును బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు ఓ మహిళా రిపోర్టర్ పట్ల ఓవరాక్షన్ చేసి ఆమో పరువు తీసేసాడు. అసలు ఏం జరిగిందంటే.. కోయింబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అన్నామలై పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో సమావేశమయ్యారు.
ఈ నేపథ్యంలో ఓ మహిళా రిపోర్టర్.. సర్ మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి ఉండకపోతే మీరు BJPలోనే ఉండేవారా? అని అడిగింది. ఆమె ప్రశ్నకు సరిగ్గా బదులు ఇవ్వకపోగా.. రామ్మా.. ఇటు వచ్చి నా పక్కకు నిలబడు. ఇలాంటి చెత్త ప్రశ్న అడిగిన నిన్ను రాష్ట్రంలో ఉన్న 8 కోట్ల మంది ప్రజలు చూడాలి. నేను ఫుల్ టైం రాజకీయ నాయకుడిని కాను. ముందు నేనొక రైతుని. ఆ తర్వాత రాజకీయ నాయకుడిని. ఆ తర్వాత BJP అధ్యక్షుడిని అని వెటకరాంగా మాట్లాడాడు.
దాంతో అక్కడి మహిళా సంఘాలు అన్నామలైపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. BJP అన్నామలైను రాష్ట్రానికి అధ్యక్షుడిని చేసింది కానీ ప్రధానిని చేయలేదు అని మండిపడుతున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. (annamalai)