Elon Musk: ట్రూడో నోరు నొక్కేస్తున్నాడు.. సిగ్గుచేటు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై (justin trudeau) మండిపడ్డారు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (elon musk). ట్రూడో కనీసం మాట్లాడనివ్వకుండా నోళ్లు నొక్కేస్తున్నాడని ఇది సిగ్గుపడాల్సిన అంశమని ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకు కెనడా ప్రభుత్వం నుంచి లైసెన్స్ ఉండాలని ట్రూడో ప్రకటించిన నేపథ్యంలో మస్క్ మండిపడ్డారు. కెనడాలో సెన్సార్‌షిప్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయని పాడ్‌కాస్ట్‌లను సర్వీసులు అందించే అన్ని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అనేది కెనడాలో కంపల్సరీ అని అక్కడ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్‌వాల్డ్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు మస్క్ సమాధానం ఇస్తూ.. ఇది మాట్లాడే స్వేచ్ఛను హరించినట్లేనని.. సిగ్గుచేటని కామెంట్ చేసారు.
ఫిబ్రవరి 2022లో కూడా ట్రూడో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అప్పట్లో వ్యాక్సిన్లు అందరికీ తప్పనిసరి చేయడంతో కెనడాలోని కొందరు పౌరులు నిరసనలు వ్యక్తం చేసారు. ఈ నిరసనలు ఎదుర్కొనేందుకు ట్రూడో ఎమర్జెన్సీ పవర్స్ వాడుకున్నారు. పౌరుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం, అరెస్ట్‌లకు పాల్పడటం వంటి అంశాలు ఎమర్జెన్సీ పవర్స్ కిందికి వస్తాయి. కెనడాలో ఫ్రీ స్పీచ్‌కు పెద్దగా చోటు లేదు. కూర్చుని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. చిన్న చిన్న విషయాలకు కూడా అక్కడి ప్రధాని ఎమర్జెన్సీ పవర్స్ వాడేస్తారు. (elon musk)