Selvamani: నా భార్య వీడియోలు ఉంటే బ‌య‌ట‌పెట్టు చూద్దాం

YSRCP మంత్రి రోజాపై (roja) అనుచిత వ్యాఖ్య‌లు చేసిన TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్య‌నారాయ‌ణ మూర్తిపై (bandaru satyanarayana) మండిపడ్డారు రోజా భ‌ర్త, ద‌ర్శ‌కుడు ఆర్కే సెల్వ‌మ‌ణి (selvamani).

“” రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకుంటే ఏడ‌వ‌కూడ‌దు అని నేను ఎప్పుడో రోజాకు చెప్పాను. ఇలా మాట్లాడేవారు ఉంటార‌ని కూడా చెప్పాను. ఇలాంటివాళ్ల వ‌ల్ల రోజా ఇంకా బ‌ల‌ప‌డుతుందే త‌ప్ప వెన‌క్కి త‌గ్గ‌దు. TDP వారు ఇంత నీచ‌మైన రాజ‌కీయం చేస్తార‌ని అనుకోలేదు. గ‌తంలో రోజా TDPలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇలాంటి నీచ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌లేదు. TDP నుంచి బ‌య‌టికి వ‌చ్చాక చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడూ మాట్లాడ‌లేదు. (selvamani)

రోజా స్ట్రాంగ్ ఫైట‌ర్. రోజాను డ‌ల్ చేయ‌డానికి ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తారు. నేను బండారుకు ఒక్క‌టే స‌వాల్ చేస్తున్నాను. మీ ద‌గ్గ‌ర ప్రూఫ్‌లు ఉంటే బ‌య‌ట‌పెట్టండి. అంతేకానీ మ‌మ్మ‌ల్ని బ్లాక్ మెయిల్ చేయొద్దు. నాకు బాల‌య్య‌తో మంచి స్నేహం ఉంది. TDP పార్టీకి వ్య‌క్తిగ‌త విష‌యాలు బ‌య‌ట‌పెట్టే రోగం ఉన్న‌ట్టుంది. రోజాను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని అనుకుంటున్నారు. నేను ఈ రాజ‌కీయాల్లో త‌ల‌దూర్చ‌ను. కానీ ఓ భ‌ర్త‌గా స్పందించాల్సి వ‌స్తుంది. ఎప్పుడైనా రోజా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి గురించి మాట్లాడారా? NTRని చెప్పుతో కొట్టిన‌వారికి ఆయ‌న గురించి మాట్లాడే అర్హ‌త లేదు.

బండారుపై మేం లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాం. చాలా కుక్క‌లు మాపై ఇలా మాట్లాడారు కానీ మేం ప‌ట్టించుకోలేదు. ఇంట్లో లేడీస్ గురించి మాట్లాడితే ఊరుకోం. చంద్ర‌బాబు నాయుడు ఓసారి కంట‌త‌డి పెట్టుకున్నారు. త‌న భార్య‌ను ఏదో అన్నార‌ని ఆయ‌న ఏడ్చారు. మ‌రి బండారు లాంటి ఇత‌ర ఫ్యామిలీల గురించి మాట్లాడేవారిని పార్టీలో చంద్ర‌బాబు ఎలా పెట్టుకున్నారు? ఇత‌ర మ‌హిళ‌ల గురించి రోజా త‌ప్పుగా మాట్లాడి ఉంటే నేను రోజా త‌ర‌ఫున సారీ చెప్తాను. (selvamani)

ఒక‌వేళ రోజా వీడియోలు ఉన్నా కూడా ఉన్నాయి బ‌య‌ట‌పెడ‌తాం అని వారు మాట్లాడ‌టం త‌ప్పు. బండారు లాంటి దుర్మార్గుల‌ను ఏ పార్టీ కూడా క్ష‌మించ‌కూడ‌దు.  నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారా? నేను ఒక‌టే స‌వాల్ చేస్తున్నాను. నా భార్య వీడియోలు ఉంటే బ‌య‌ట‌పెట్టండి. తేల్చుకుందాం. NTRని చంపేసి ఇప్పుడు ఆయ‌న భ‌జ‌న చేస్తూ బ‌తికేస్తున్నారు. ఈ విష‌యంలో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన (janasena) ఖండిస్తుంద‌ని కూడా నేను ఆశించ‌డంలేదు. ఎందుకంటే రోజా అంటే వారికి కూడా న‌చ్చ‌దు.

రోజా లాంటి మంత్రికే ఇక్క‌డ మ‌ర్యాద లేన‌ప్పుడు ఇక మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో భాగంగా ఇత‌ర మ‌హిళ‌లు ఎలా వ‌స్తారు రాజ‌కీయాల్లోకి? రోజా బ‌య‌టికి చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తుంది కానీ ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు. లేడీస్ గురించి త‌ప్పుగా మాట్లాడాలంటే భ‌య‌ప‌డాలి. అది ఏ పార్టీకి చెందిన వారికైనా వ‌ర్తిస్తుంది. అలాంటి భ‌యాన్ని స‌మాజంలో తీసుకురావాలి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌. ఇప్పుడు బండారు చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల ఆయ‌న ఇంట్లో ఆడ‌వాళ్లు ఎలా చూస్తారు? నా భార్య వీడియోలు చూస్తే నేను ఏమైపోతానో అని చింతించ‌కండి. మీరు బ‌య‌ట‌పెట్టండి. మేం లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకుంటాం “” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు సెల్వ‌మ‌ణి.