Kasireddy: కల్వకుర్తి టికెట్ ఇవ్వకపోవడంతో BRSకి రాజీనామా
కల్వకుర్తి టికెట్ ఇవ్వకపోవడంతో BRSకి రాజీనామా చేసారు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (kasireddy). త్వరలో ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారు. టికెట్ ఇవ్వనందుకు రాజీనామా చేసిన ఆయన తన రాజీనామాకు అసలు కారణం తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతో ఏర్పాటైందో ఆ లక్ష్యం తొమ్మిదేళ్లు గడిచినా నెరవేరలేదని రాజీనామా లేఖలో రాసారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో కాంగ్రెస్ తెలంగాణకు 6 హామీలు ఇచ్చిందని.. ఆ హామీలతో అయినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశతో కాంగ్రెస్లోకి వెళ్లాలనుకుంటున్నానని పేర్కొన్నారు.