వాస్తు ప్రకారం ఈ తప్పులు చేస్తే సక్సెస్ రాదు
వాస్తుశాస్త్రం (vastu) ప్రకారం.. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని పనులు చేయకూడదట. మనం చేసే పనులు యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయో లేవో తెలియజేసేదే వాస్తు. మరి ఈ వాస్తుశాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేస్తే మన దగ్గర లక్ష్మీదేవి నిలవదో తెలుసుకుందాం.
మనం ఉండే ఇంటిని వాస్తు ప్రకారం అన్నీ దగ్గరుండి చూసుకుని కట్టించుకుంటాం. కేవలం కట్టించుకుంటే సరిపోదు ఆ ఇంటిని ఎలా చూసుకుంటున్నాం అనే విషయం కూడా వాస్తు శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకుండా చిందర వందరగా పెట్టుకుంటే వాస్తు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో డబ్బు నిలవదు. ఎక్కడ వేసిన గొంగళిలా అలాగే ఉండిపోతారు. (vastu)
మీ ఇంట్లోని నైరుతి దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నైరుతి దిశను ఎలా చూసుకుంటున్నారో.. ఎలాంటి వస్తువులు పెట్టుకుంటున్నారో గమనించడం ఎంతో ముఖ్యం. నైరుతి దిశలో ఎలాంటి భారీ వస్తువులు పెట్టకండి. దుమ్ముధూళిని చేరనివ్వకండి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి. అక్కడ మనీ ప్లాంట్, పిగ్గీ బ్యాంక్ వంటివి పెట్టుకుంటే మంచిది.
ఇంట్లో అద్దాలు, నీటికి సంబంధించిన వస్తువులను ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా ఎంతో ముఖ్యం. అద్దాలను బాత్రూమ్‌ల దగ్గర పెట్టకూడదు. అదే విధంగా నీటికి సంబంధించిన వస్తువులు అంటే అక్వేరియం, చిన్న ఫౌంటేయిన్స్ బాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాటిని మెయింటైన్ చేయలేకపోతే ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది. (vastu)