Renu Desai: టైగ‌ర్ సినిమాలో రేణూ లుక్ వైర‌ల్

అప్పుడెప్పుడో 2000ల్లో వ‌చ్చిన‌ భ‌ద్రి, జానీ సినిమాల‌తో అల‌రించారు రేణూ దేశాయ్‌ (renu desai). ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) వివాహం చేసుకుని ఇంటి బాధ్య‌త‌ల‌ను చూసుకునేందుకు సినిమాలు మానేసారు. ఇప్పుడు ఎంతో కాలం త‌ర్వాత టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (tiger nageshwara rao) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇందులో రేణూ హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మాస్ మహారాజా ర‌వితేజకు (raviteja) జోడీగా కృతి స‌న‌న్ (kriti sanon) చెల్లెలు నుపూర్ స‌న‌న్ (nupur sanon) న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 3న ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అవ‌బోతోంది.