Anil Kumar: మేం త‌లుచుకుంటే లోకేష్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాం

మేం త‌లుచుకుంటే నారా లోకేష్‌ను (nara lokesh) ఇప్పుడే అరెస్ట్ చేయిస్తామ‌ని అంటున్నారు YSRCP నేత అనిల్ కుమార్ యాద‌వ్ (anil kumar). నిన్న TDP కార్య‌క‌ర్త‌లు మోత మోగిద్దాం కార్య‌క్ర‌మం చేప‌ట్టిన నేప‌థ్యంలో అనిల్ కుమార్ యాద‌వ్ ప్రెస్ మీట్ పెట్టారు. మోత మోగిద్దాం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారిలో చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌భ్యులు త‌ప్ప ఏ ఒక్క నేత ముఖంలో కూడా బాధ లేద‌ని అందరూ ఏదో సంతోషంలో ఫోటోలు తీస్తాం కాబ‌ట్టి విజిల్స్ వేసిన‌ట్లు ఉంద‌ని ఎద్దేవాచేసారు. ఒక్క కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ముఖంలో త‌ప్ప మ‌రే నాయ‌కుడి ముఖంలో కూడా చంద్ర‌బాబు అరెస్ట్ అయ్యాడ‌న్న బాధ‌లేద‌ని అన్నారు. మొన్న అసెంబ్లీలో స్పీక‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి గోల చేసింది కూడా చంద్ర‌బాబు నాయుడు బ‌య‌టికి వ‌చ్చాక మెచ్చుకోకుండాపోతారా అన్న ఉద్దేశంతో అలా చేస్తున్నార‌ని త‌మ అధినేత చేసింది త‌ప్పే అని వారికీ తెలుస‌ని అన్నారు. (anil kumar)

తాము త‌లుచుకుంటే లోకేష్‌ను ఇప్ప‌టికిప్పుడు అరెస్ట్ చేయిస్తామ‌ని కానీ ప్రాసెస్ ప్రకారం వెళ్లాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు. లోకేష్ ఢిల్లీలో ఇన్ని రోజులు ఎందుకు ఉన్నారో తెలీద‌ని.. ఆయ‌న కేవ‌లం త‌న పార్టీ మంత్రుల‌తో త‌ప్ప మ‌రెవ్వ‌రినీ క‌లిసిన‌ట్లు ఫోటోలు కానీ వీడియోలు కానీ బ‌య‌టికి రాలేద‌ని వెట‌కారంగా మాట్లాడారు.