Nitin Gadkari: నేను మంచి చేసాను అనిపిస్తేనే ఓటెయ్యండి

“” రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఇక నా ఫోటోలు పోస్ట‌ర్లు అంటించ‌ను. ఎవ్వ‌రికీ ఓట్లు వేయ‌మ‌ని డ‌బ్బులు పంచ‌ను. నేను ఈ దేశం కోసం ఏం చేసానో నాకు తెలుసు. మీకు కూడా నా సేవ‌లు న‌చ్చితే నా ప‌నిత‌నం న‌చ్చితేనే ఓటు వెయ్యండి. లేదంటే లేదు “” అని మీడియా ముందు వెల్ల‌డించారు కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (nitin gadkari). ఇక రాష్ట్రంలోని ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో ఎలాంటి గుంత‌లు లేకుండా రోడ్లు సాఫీగా ఉండేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఓ కొత్త పాల‌సీని తీసుకురానుంద‌ని తెలిపారు. ఇక బాట్ (బిల్డ్ ఆప‌రేట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా రహ‌దారులు వేయించ‌నున్నామ‌ని దాని వ‌ల్ల రోడ్ల మెయింటైనెన్స్ బాగుంటుంద‌ని పేర్కొన్నారు.