Pakistan: బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియా అంటూ నిందలు
ఇటీవల పాకిస్థాన్‌లోని (pakistan) ఓ మసీదు ప్రాంగణంలో రెండు వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా మృత్యువాతపడ్డారు. అయితే ఈ పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ఏజెంట్లే అని పాక్ ఆరోపిస్తోంది. ఇండియాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే (RAW) ఈ పేలుళ్లకు పాల్పడ్డాయని పాక్ మంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఆరోపించారు. సూసైడ్ బాంబ్ ఎటాకర్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నారు.
సాధారణంగా ఎక్కడైనా బాంబు దాడులకు పాల్పడిన తర్వాత అది చేసింది మేమే అని కొన్ని సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ పాకిస్థాన్‌లో జరిగిన పేలుళ్ల వెనుక ఎవరున్నారు అనేది ఇప్పటివరకు ఇంకా తెలీలేదు. ఎక్కువగా పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఐ-తాలిబన్ పాకిస్థాన్ అనే సంస్థ దాడులకు పాల్పడుతూ ఉంటుంది. కానీ పాక్ మంత్రి ఇండియానే దాడులు చేయించి అనడం హాస్యాస్పదంగా ఉంది.