Elections: గాంధీకి గాడ్సేకి మ‌ధ్య యుద్ధం

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) NDA, ఇండియా కూట‌ములు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే ఇండియా (india) కూట‌మిని మ‌హాత్మా గాంధీతో.. NDA కూట‌మిని న‌థూరామ్ గాడ్సేతో పోల్చారు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ (rahul gandhi). మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాజాపూర్‌లో నిర్వ‌హించిన జ‌న ఆక్రోశ్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ BJP మ‌ధ్య‌న ఉన్న‌ది ప్రేమ‌, ద్వేషానికి సంబంధించిన భావ‌జాలాల‌ని అన్నారు.

ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌తో BJP రెచ్చ‌గొట్టేలా మాట్లాడితే.. కాంగ్రెస్ ప్రేమ‌గా ప‌ల‌క‌రించేందుకు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు య‌త్నిస్తుంద‌ని తెలిపారు. భార‌త్ జోడో యాత్ర స‌మ‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు రైతులు, యువ‌త‌, మ‌హిళలు BJP పాల్ప‌డిన అవినీతి కార్య‌క్ర‌మాల గురించి త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని వాటి వల్ల త‌మ జీవితాల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని బాధ‌ప‌డ్డార‌ని రాహుల్ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. (lok sabha elections)