Anushka Sharma: రెండో బిడ్డ రాబోతోందా?

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ (anushka sharma) త‌ల్లికాబోతోందా? అనుష్క శర్మ‌కు చెందిన కొన్ని స‌న్నిహిత వ‌ర్గాలు బాలీవుడ్‌లో ఈ విష‌యం గురించి చ‌ర్చించుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అనుష్క మొద‌టిసారి ప్ర‌గ్నెంట్ అయిన‌ప్పుడు ఎలాగైతే స‌ర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే అనౌన్స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. 2021 జ‌న‌వ‌రిలో అనుష్క విరాట్ దంప‌తులు మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. పాప‌కు వామిక అని పేరు పెట్టారు. వామిక పుట్టిన‌ప్ప‌టి నుంచి అనుష్క సినిమాల‌కు దూరంగా ఉంటోంది. కేవ‌లం యాడ్స్ చేస్తోంది. త‌న చేతిలో కేవ‌లం మ‌హిళా క్రికెట‌ర్ జులియ‌న్ గోస్వామి బ‌యోపిక్ మాత్ర‌మే ఉంది. ఈ సినిమా చేసి తీరాల్సిందే అనిపించేలా స్క్రిప్ట్ వ‌స్తేనే న‌టిస్తాన‌ని లేదంటే త‌న సమయం మొత్తాన్ని కుటుంబానికే అంకితం చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు అనుష్క తెలిపింది. (anushka sharma pregnant)