Balakrishna: దెబ్బకు దెబ్బ కోతకు కోత

హిందూపూర్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ (balakrishna) జ‌గ‌న్ స‌ర్కార్‌పై (jagan) విరుచుకుప‌డ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయించినా.. త‌ప్పు చేయ‌ని వాడు దేవుడికి కూడా భ‌య‌ప‌డ‌డు అని అన్నారు. జ‌గ‌న్‌పై ఉన్న‌న్ని కేసులు ఏ రాజ‌కీయనాయ‌కుడిపైనా లేవ‌ని అన్నారు. జ‌గ‌న్ 16 నెల‌లు జైలులో శిక్ష అనుభ‌వించారు కాబ‌ట్టి చంద్ర‌బాబు (chandrababu naidu) 16 నిమిషాలు అయినా ఉండాల‌న్న క‌క్ష‌సాధింపు చ‌ర్యలో భాగంగానే ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తెలిపారు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు అంబ‌టి రాంబాబు (ambati rambabu) ఓ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌లో ఎంతో లాభ‌ప‌డ్డాడు. త‌న ముఠా లాభ‌ప‌డేలా చ‌ర్య‌లు చేప‌ట్టాడు. అప్ప‌ట్లో కోర్టు కూడా రాంబాబు రింగ్ రోడ్డు విష‌యంలో లాభ‌ప‌డ్డార‌ని తీర్పు వెల్ల‌డించింది. ఎవ‌రు ఎన్ని ఎత్తులు వేసినా రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో (ap elections) అధికారంలోకి వ‌చ్చేది తెలుగు దేశం పార్టీనేనని ధీమా వ్య‌క్తం చేసారు.