Ujjain Rape: బాలిక‌కు సాయం చేయ‌నివారిపై కేసులు

ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని (ujjain rape) ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఓ బాలిక ర‌క్త‌మోడుతూ సాయం కోసం ప్ర‌తి ఇంటికీ వెళ్లి అభ్య‌ర్ధించింది. కొంద‌రు క‌నిక‌రించ‌లేదు. మ‌రికొంద‌రు కేవ‌లం రూ.50, రూ.100 ఇచ్చి త‌రిమేసారు. చివ‌రికి ఓ పూజారి బాలిక‌కు దుస్తులు వేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసి హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈ బాలిక ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఎవ‌రైతే బాలిక‌కు సాయం చేయ‌లేదో వారిపై కేసులు పెట్ట‌బోతున్న‌ట్లు సీనియ‌ర్ పోలీస్ అధికారి వెల్ల‌డించారు. క‌నీస సాయం చేయ‌క‌పోతే ఈ స‌మాజంలో ఎందుకు బ‌తుకుతున్న‌ట్లు అని మండిప‌డ్డారు. ప్ర‌తి ఒక్క‌రి వివ‌రాలు సీసీటీవీలో క్లియర్‌గా ఉన్నాయ‌ని.. ఆ వీడియో ఆధారంగా వారి ఇళ్ల‌కు నోటీసులు వెళ్తాయ‌ని పేర్కొన్నారు. (ujjain rape)

ఉరిశిక్ష వేయాల్సిందే

మ‌రోప‌క్క ఓ బంధువు చూపించిన వీడియో ద్వారా అందులో ఉన్నది త‌న బిడ్డే అని తెలుసుకున్న ఆ బాలిక తండ్రి నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి బాలిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఆ బాలిక చ‌దువు, ట్రీట్మెంట్ ఖ‌ర్చులు అన్నీ తానే భ‌రిస్తాన‌ని కేసు న‌మోదు చేసిన అధికారి అజ‌య్ వ‌ర్మ త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నారు.