Shivraj Chouhan: వాడికి స‌మాజంలో ఉండే హ‌క్కు లేదు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో (ujjain rape) ఓ బాలిక‌ను దారుణంగా అత్యాచారం చేసిన ఆటో డ్రైవ‌ర్ ప‌ట్ల సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ (shivraj chouhan) మండిప‌డ్డారు. వాడికి ఈ స‌మాజంలో ఉండేందుకు హ‌క్కు లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప్ర‌స్తుతం పోలీస్ కస్ట‌డీలో ఉన్న నిందితుడు పారిపోవ‌డానికి య‌త్నించ‌డంతో పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ప్ర‌తి గంట‌కూ విచార‌ణ‌కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ద‌గ్గ‌రుండి చూస్తున్నాన‌ని క‌ఠిన శిక్ష‌ప‌డేవ‌ర‌కు వ‌దిలేది లేదని తెలిపారు.