Shiva Rajkumar: ప‌వన్ క‌ళ్యాణ్‌ కూడా నాలాగే..!

క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ (shivaraj kumar) ట్విట‌ర్‌లో ఫ్యాన్స్ చిట్ చాట్ చేస్తూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu), ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి కూడా మాట్లాడారు. మ‌హేష్‌ని చాలా సార్లు క‌లిసాన‌ని.. చాలా నిదానంగా త‌క్కువ‌గా మాట్లాడ‌తాడ‌ని అన్నారు. బ‌య‌ట అంత సాఫ్ట్‌గా ఉండే వ్య‌క్తి సినిమాల్లో త‌న పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొడుతుంటే నిజంగా షాకింగానే ఉంద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ ఒక‌రు.. మా అన్న‌య్య గురించి మీ అభిప్రాయం ఏంటి స‌ర్ అని అడిగాడు. ఇందుకు శివ‌న్న స్పందిస్తూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌లాగే చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటాడ‌ని త‌న‌కు మంచి ఫ్రెండ్ అని అన్నారు. అంతేకాదు.. ప‌వ‌న్‌తో దిగిన‌ప్ప‌టి రేర్ ఫోటో ఒక‌టి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.