Salaar: డిసెంబ‌ర్‌లోనే వ‌స్తున్నా..!

హ‌మ్మ‌య్య‌.. ఎట్ట‌కేల‌కు స‌లార్ (salaar) రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎన్నోసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 22న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టీం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా స‌లార్ సినిమా నుంచి రిలీజ్ చేసిన‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) కొత్త లుక్ కూడా తెగ వైర‌ల్ అవుతోంది. అయితే డిసెంబ‌ర్ 22నే షారుక్ ఖాన్ (shahrukh khan) న‌టించిన డంకీ (dunki) సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈసారి మాత్రం షారుక్ సినిమా స‌లార్ (salaar) సీజ్‌ఫైర్‌లో కొట్టుకుపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.