Vishal: సెన్సార్ బోర్డులో అవినీతి.. 6.5 లక్షలు కట్టించుకున్నారు
సెన్సార్ బోర్డులో (censor board) అవినీతి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు నటుడు విశాల్ (vishal). ఆయన యాక్ట్ చేసిన మార్క్ ఆంటోనీ (mark antony) సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. ఇందుకోసం ముంబైలో CBFC కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ మేనగ అనే వ్యక్తి సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏకంగా తన నుంచి మొత్తం రూ.6.5 లక్షలు వసూలు చేసాడని ట్విటర్ ద్వారా వెల్లడించారు. సినిమాలో అవినీతిని చూపిస్తే ఫర్వాలేదు కానీ బయట అవినీతి అంటేనే జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. డబ్బులు చెల్లించినట్లు ఆధారాలు చూపుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే, ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేసారు.