2018: ఆస్కార్ ఎంట్రీ దక్కించుకున్న మలయాళ చిత్రం
మలయాళంలో (malayalam) సంచలన హిట్ కొట్టిన 2018 సినిమా అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్ (oscar) ఎంట్రీ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రకటించింది. టోవినో థామస్ (tovino thomas) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉందని ఈ సమాజంలో జరుగుతున్న అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించారని అకాడమీ అవార్డ్స్ భావించిందట. 2018 కంటే ముందు 22 సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటిలో ది కేరళ స్టోరీ, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే, బలగం, వాల్వి, బాప్ల్యోక్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత 2018 సినిమాను అఫీషియల్ ఆస్కార్ ఎంట్రీకి ఫైనలైజ్ చేసారు. కేరళలో 2018లో సంభవించిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తీసారు.