Nijjar: పాక్ ISI చంపేసి భారత్‌పై తోసేసిందా?
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను (nijjar) పాకిస్థాన్ ISI చంపేసి నేరం భారత్‌పైకి తోసినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. నిజ్జర్ లాంటి వ్యక్తిని అధికారులు ప్లాన్ చేసి చంపడం అంత సులువు కాదని..అతని పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వారి ప్రమేయం లేకుండా నిజ్జర్‌ను చంపడం అంత సులువు కాదని అంటున్నారు. పాక్ ISI నిజ్జర్‌ను చంపి భారత్‌పై తోసేయాలని ప్లాన్ వేసిందట. పాక్‌కు చెందిన రహత్ రావు, తారిక్ కియానీలు కెనడాలో పాక్ ఏజెన్సీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఇండియా నుంచి అక్రమంగా వస్తున్న ఖలిస్తానీలకు కెనడాలో అన్ని సౌకర్యాలు కల్పించేది కూడా వీరిద్దరే.
వ్యాపార కార్యకలాపాల కోసమే రహత్, తారీఖ్‌లు కలిసి నిజ్జర్‌ను ప్లాన్ ప్రకారం చంపేసారన్న అనుమానాలు ఉన్నాయి. నిజ్జర్ నివసించే ప్రదేశంలో చాలా మంది పాక్ మాజీ ISI అధికారులు కూడా నివసిస్తున్నారు. కెనడా, పాకిస్తాన్‌లలో నిజ్జర్ డ్రగ్ డీలింగ్ మాఫియా ఆపరేట్ చేసేవాడు. దీని నుంచే అతను డబ్బులు సంపాదించేవాడు. ప్రతి పనిలో నిజ్జర్ ముందే ఉంటున్నాడన్న అసూయతో రహత్, తారీఖ్‌లు సుపారీ ఇచ్చి నిజ్జర్‌ను చంపించారని తెలుస్తోంది. అంతేకాదు.. పాక్‌కి చెందిన వధావా సింగ్, రాజ్‌నీత్ సింగ్ అనే ఇద్దరు లీడర్ల వల్ల ISIకి సమస్యలు ఏర్పడుతున్నాయి. వీరిద్దరి వల్ల ఎలాంటి మేజర్ టాస్కులు చేయడానికి వీలు పడటంలేదు. ఈ ఇద్దరితో నిజ్జర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి.. నిజ్జర్ అడ్డు తొలగిపోతే డ్రగ్ రాజ్యాన్ని తామే ఏలచ్చని రహత్, తారీఖ్‌లు ప్లాన్ వేసారు. నిజ్జర్‌ను చంపి ఫోకస్ ఇండియాపైకి షిఫ్ట్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని హెటెక్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. (nijjar)