14 ఏళ్ల తర్వాత భార్య ఇండియన్ కాదని తెలిసి..
14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ 14 ఏళ్లల్లో ఎలాంటి గొడవలు లేవు. సంతోషంగా జీవించారు. కానీ ఇప్పుడు విడాకులు కావాలని భర్త కోర్టుకెక్కాడు. ఎలాంటి గొడవలు లేనప్పుడు విడాకులు ఎందుకు అనుకుంటున్నారా? తన భార్య ఇండియన్ అనుకుని పెళ్లి చేసుకున్నాడట. తీరా చూస్తే ఆమె బంగ్లాదేశీ (bangladesh) మహిళ అని తెలిసి షాకయ్యాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బెంగాల్‌లోని అసాన్సోల్ ప్రాంతానికి చెందిన తమీష్ అనే 37 ఏళ్ల వ్యాపారవేత్త 2009లో నజియా అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో నజియా తాను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుందట. అలా వారి పెళ్లి సజావుగా జరిగిపోయింది.
2022 వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే వీరిద్దరికీ రెండో బిడ్డ పుట్టబోతోందని తెలిసిందో అప్పటినుంచి సమస్య మొదలైంది. అప్పటివరకు బాగానే ఉన్న నజియా.. త్వరలో రెండో బిడ్డ డెలివరీ ఉండగా పుట్టింటికి వెళ్తానని చెప్పి వెళ్లిందట. కొన్ని రోజుల తర్వాత నజియా పుట్టింటివారు తబిష్‌కి ఫోన్ చేసి ఇక తమ బిడ్డ ఇండియా రాదని బెదిరింపులకు పాల్పడ్డారట. ఇండియాకి రాకపోవడం ఏంటి.. అని నజిగా గురించి ఆరా తీస్తున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు తబీష్‌పై 498A సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. దాంతో పోలీసులు తబిష్‌ను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత తబిష్ బెయిల్‌పై రిలీజ్ అయ్యి అసలు నజియా ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. బంధువుల ద్వారా నజియా గురించి అసలు విషయం బయటపడటంతో అతను షాకయ్యాడు. నజియా ఇండియన్ కాదు బంగ్లాదేశీ.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. తబిష్‌ను పెళ్లి చేసుకోడానికి ముందు నజియా బంగ్లాదేశ్‌లో ఓ టీచర్‌ను పెళ్లి చేసుకుని అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. లేని పోని ఆరోపణలు చేసి అతన్ని బెదిరించి డబ్బుతో పారపోయింది. ఆ తర్వాత అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టి తబిష్‌ని నమ్మించి పెళ్లి చేసుకుంది. తబిష్‌ని పెళ్లి చేసుకుంటే ఇండియన్ సిటిజన్‌షిప్ వస్తుందని ప్లాన్ వేసింది. దాంతో తబిష్ నజియాతో ఆమె కుటుంబీకులపై కూడా కేసులు వేసాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. (bangladesh)