Swathi: విడాకుల గురించి మాత్రం చెప్ప‌ను

ప్ర‌ముఖ న‌టి క‌ల‌ర్స్ స్వాతి (swathi) విడాకులు గురించి మాత్రం మీడియా ముందు ఏమీ చెప్ప‌న‌ని అన్నారు. ఆమె యాక్ట్ చేసిన మంత్ ఆఫ్ మ‌ధు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా స్వాతి మీడియాతో మాట్లాడారు. 2018లో స్వాతి వికాస్ వాసు అనే పైల‌ట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్ల త‌ర్వాత స్వాతి ఇన్‌స్టాగ్రామ్‌లోని పెళ్లి ఫోటోల‌న్నీ డిలీట్ అయిపోయాయి. దాంతో ఆమె విడాకులు తీసుకోబోతున్నార‌ని అంతా అనుకున్నారు. అప్ప‌ట్లో స్వాతి దీనిపై స్పందిస్తూ.. త‌న ఫోటోల‌ను వికాస్ గ్యాల‌రీలోకి ఆర్కైవ్ చేసాన‌ని అన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ విడాకుల ప్ర‌స్తావ‌న రావడంతో మీడియా వ‌ర్గాలు దీనిపై స్పందించాల‌ని అన్నాయి. అయితే స్వాతి మాత్రం అస్స‌లు చెప్ప‌ను అని అన్నారు. మీడియా ముందు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు మాత్రం చెప్ప‌కూడ‌ద‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్తలోనే నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. (colors swathi)