చంద్రబాబు నాయుడుకి తప్పకుండా బెయిల్ వస్తుంది
రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల వల్ల చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సతమతమవుతున్నారన్న విషయంపై YSRCP నేత కొడాలి నాని (kodali nani) స్పందించారు. జైల్లో దోమలు కుట్టక రంభ ఊర్వశి మేనక వచ్చి కన్ను కొట్టి పోతారా అంటూ వెటకారంగా మాట్లాడారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో స్కాం ఉందని ఎప్పటినుంచో మొత్తుకుంటున్నామని ఇప్పటికి ఆధారాలు దొరికాయని అన్నారు. చంద్రబాబు నాయుడు పట్ల తమకు కానీ తమ పార్టీకి కానీ ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని.. ఆయనకు తప్పకుండా బెయిల్ వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేత ఉంటేనే బాగుంటుందని అన్నారు. జైల్లో పెట్టిన వ్యక్తులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు బెయిల్ అయితే వస్తుంది కదా అన్నారు. (kodali nani)