Cauvery: శ‌తాబ్దం నాటి ర‌చ్చ‌..!

కావేరీ.. (cauvery) త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో ప్ర‌వ‌హిస్తున్న న‌ది. శ‌తాబ్దం నాటి నుంచి ఈ న‌ది కోసం త‌మిళ‌నాడు (tamilnadu), క‌ర్ణాట‌క (karnataka) రాష్ట్రాలు కొట్టుకుంటూనే ఉన్నాయి. కాక‌పోతే ఈరోజు ఈ గొడ‌వ కాస్తా ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతుండే బెంగ‌ళూరును మూగ‌బోయేలా చేసింది. అస‌లు ఏంటీ కావేరీ గొడ‌వ‌?

1924 అగ్రీమెంట్

1924లో త‌మిళ‌నాడు, పుదుచ్చేరికి నాడు నిర్మించిన కృష్ణ రాజా సాగ‌ర్ డ్యాం (krishna raja sagar dam) నుంచి సింహ భాగంలో అందాల‌ని అగ్రీమెంట్ కుదిరింది. 30 ఏళ్ల త‌ర్వాత డ్యాంల నిర్మాణం ఎక్కువ అయిపోవడంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఆ స‌మ‌యంలో త‌మిళ‌నాడులో పెద్ద‌గా వ‌ర్షాలు లేక పొలాలు ఎండిపోతుంటే ఎక్కువ శాతంలో నీటి అవ‌స‌రం వచ్చింది. 1986లో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాలు కావేరీ న‌ది నీటిని 47% వ‌ర‌కు వాడుకోవాల‌ని అనుకున్నారు.

కానీ ఇది రెండు రాష్ట్రాల‌కు న‌చ్చ‌లేదు. దాంతో ఈ స‌మ‌స్య కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. దాంతో సుప్రీంకోర్టు ఈ కేసు విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిగేలా ఓ ట్రిబ్యూన‌ల్‌ని ఏర్పాటుచేసింది. ఆ ట్రిబ్యూన‌ల్ ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. త‌మిళ‌నాడుకు 205 వేల మిలియ‌న్ క్యూబిక్ ఫీట్ నీటిని వాడుకోవాల‌ని చెప్పింది. ఈ నిర్ణయంలో క‌ర్ణాట‌క‌లో అల్ల‌ర్లు మొద‌ల‌య్యాయి. దాంతో సుప్రీంకోర్టు త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. 1998లో రెండో ట్రిబ్యూన‌ల్ ఏర్పాటుచేసారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత త‌మిళ‌నాడుకు ఇవ్వాల్సిన షేర్ 192 వేల మిలియ‌న్ క్యూబిక్ ఫీట్‌కి ప‌డిపోయింది.  (cauvery)

2018లో మ‌ళ్లీ సుప్రీంకోర్టు క‌ల‌గ‌జేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు త‌మిళ‌నాడుకు 404.25 tmcft, కర్ణాట‌క‌కు 284.75 tmcft నీరు అందాల్సి ఉంది. ఏ స‌మ‌యంలో ఎంత శాతం కావేరీ జ‌లాల‌ను విడుద‌ల చేయాల‌న్న విష‌యంపై ఓ అధికారిని కూడా కోర్టు నియ‌మించింది. ఇప్పుడు క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల ఆందోళ‌న ఏంటంటే.. ఎక్క‌డి నుంచైతే కావేరీ న‌ది ప్ర‌వాహం మొద‌ల‌వుతుందో.. అక్క‌డ స‌రిగ్గా వ‌ర్షాలు ప‌డ‌టంలేద‌ని, దీని వ‌ల్ల త‌మిళ‌నాడుతో నీటిని షేర్ చేసుకుంటున్న‌ట్లు ఇప్పుడు షేర్ చేసుకోవ‌డం కుద‌ర‌ద‌ని అంటున్నారు.

రాజ‌కీయ సెగ‌

ఊహించిన‌ట్లుగానే… ఇటీవ‌ల పొత్తు ప్ర‌క‌టించిన BJP, JD(S) పార్టీలు ఇరు రాష్ట్రాల్లో ఉన్న అధికారిక ప్ర‌భుత్వాల‌పై ఆరోప‌ణ‌లు చేసాయి. ఇది ప్ర‌భుత్వాల వైఫ‌ల్య‌మేన‌ని దొరికిందే ఛాన్స్ అన్న‌ట్లు వారికి వ్య‌తిరేకంగా మారాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రైతుల‌కు మ‌ద్దతుగా నిల‌వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. త‌మిళ‌నాడుకి కేవ‌లం రోజుకి 3000 క్యూసెక్స్ నీటినే విడుద‌ల చేస్తామ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకి తెలియ‌జేసింది. ఈ విష‌యంలో తాము ఏమీ చేయ‌లేమ‌ని.. ఇరు రాష్ట్రాలు కూర్చుని చ‌ర్చించుకుని ఓ ప‌రిష్కారానికి రావాల‌ని తెలిపింది. దాంతో ఇప్పుడు బంద్‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ కావేరీ గొడ‌వ ఎప్ప‌టికి తీరుతుందో ఏమో..! (cauvery)