KTR: మనకు గవర్నర్ పాలన అవసరమా?
దేశంలో మనకు గవర్నర్ రూల్ అనేది అవసరమా అని ప్రశ్నించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులను గవర్నర్ తమిళిసై (tamilisai) ఆమోదించకపోవడంపై KTR స్పందించారు. గవర్నర్ మోదీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారని తెలంగాణ గవర్నర్ అవ్వడానికి ఒకరోజు ముందు వరకు BJP అధ్యక్షురాలిగా తమిళిసై పనిచేసారని అన్నారు. అసలు ఈ గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిదని.. ఇది ఇప్పుడు దేశంలో అవసరం లేదని తెలిపారు. జమిలి ఎన్నికలు అనేవి కేంద్ర ప్రభుత్వం జిమ్మిక్ అని మండిపడ్డారు.