Parineeti Weds Raghav: క‌ళ్యాణం.. క‌మ‌నీయం..!

బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా.. (parineeti weds raghav) AAP ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాలు (raghav chadha) వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. నిన్న రాజ‌స్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. పెళ్లి ఫోటోల‌ను కొత్త దంప‌తులు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌మ ఫ‌రెవ‌ర్ ప్ర‌యాణం మొద‌లైంద‌ని అన్నారు. అయితే ఈ వివాహ వేడుక‌కు పరిణీతి చోప్రా సోద‌రి ప్రియాంక చోప్రా (priyanka chopra) మాత్రం రాలేక‌పోయింది. ప్రియాంక అమెరికాలో షూటింగ్‌లో బిజీగా ఉండ‌టంతో రాలేక‌పోతున్నాన‌ని స్పెష‌ల్ గిఫ్ట్ పంపింది.

పొలిటీషియ‌న్‌ని చేసుకోను

మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం ప‌రిణీతి.. కాఫీ విత్ క‌ర‌ణ్ అనే పాపుల‌ర్ టాక్ షోలో పాల్గొన్నారు. అప్పుడు హోస్ట్ క‌ర‌ణ్ జోహార్ ప‌రిణీతి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నారు అని అడిగారు. ఇందుకు ప‌రిణీతి ఆన్స‌ర్ ఇస్తూ.. ఎవ‌రైనా ఓకే కానీ రాజ‌కీయ నాయ‌కుడిని మాత్రం అస్స‌లు చేసుకోను అన్నారు. కానీ ఇప్పుడు ఆమె ఓ పొలిటిషియ‌న్‌కే భార్య కాబోతున్నారు. (parineeti weds raghav)