Kannappa: పార్వ‌తీ దేవి పాత్ర‌లో న‌య‌న్‌?

మంచు విష్ణు (manchu vishnu) త‌న‌కెంతో ఇష్ట‌మైన క‌న్న‌ప్ప (kannappa) సినిమాకు శ్రీకారం చుట్టేసారు. ఇందులో శివుడి పాత్ర కోసం ప్రభాస్‌ను (prabhas) అడ‌గ్గా.. ఆయ‌న ఒప్పేసుకున్నారు. ఇక హీరోయిన్‌గా న‌టి కృతి స‌న‌న్ (kriti sanon) చెల్లెలు నుపూర్ స‌న‌న్‌ను (nupur sanon) ఎంపిక‌చేసుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె సినిమా నుంచి ఇటీవ‌ల వాకౌట్ చేసింది. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో పార్వ‌తి దేవి పాత్ర‌లో లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార (nayanthara) న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమ్మ‌వారి పాత్ర కావ‌డంతో న‌య‌న్ కూడా ఒప్పుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. శ్రీరామ‌రాజ్యం సినిమాలో సీత‌మ్మ‌గా.. అమ్మోరుత‌ల్లి సినిమాలో అమ్మ‌వారిగా న‌య‌న్ చాలా బాగా ఆక‌ట్టుకున్నారు. అందుకే ఇందులో పార్వ‌తి దేవి పాత్ర కోస‌మ‌ని న‌య‌న్‌ను ఎంపిక‌చేసిన‌ట్లు తెలుస్తోంది.