Chandrababu Naidu: రెండో రోజు విచార‌ణ షురూ

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) రెండు రోజుల పాటు క‌స్ట‌డీలోకి తీసుకున్న AP CID విచార‌ణ ఈరోజుతో ముగియ‌నుంది. ఈరోజుతో చంద్ర‌బాబు జ్యుడిషియ‌ల్ రిమాండ్ కూడా ముగుస్తుంది. దాంతో త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతోంది అనే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నిన్న దాదాపు పది ప్ర‌శ్న‌ల‌పై విచార‌ణ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వాటిలో కొన్నింటికి మాత్ర‌మే చంద్ర‌బాబు నుంచి స‌మాధానం వ‌చ్చింద‌ట‌. ఆయ‌న చెప్పిన స‌మాధానాల ఆధారంగా ఈరోజు విచార‌ణ కొన‌సాగ‌నుంది.