Varanasi: 30 వేల మందికి స‌రిపోయే స్టేడియం ప్ర‌త్యేక‌త‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ఈరోజు వార‌ణాసిలో (varanasi) క్రికెట్ స్టేడియంకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.450 కోట్ల‌తో ఈ స్టేడియంను రూపొందిస్తున్నారు. స్టేడియం కోసం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.221 కోట్లు పెట్టి భూమిని కొనుగోలు చేయ‌గా.. మిగ‌తా ప‌నుల కోసం BCCI రూ.330 కోట్లు వెచ్చించింది. ఈ స్టేడియంలో ఒకేసారి ఏకంగా రూ.30 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించ‌వ‌చ్చ‌ట‌. వార‌ణాసిలోని ర‌జ‌తా ల్యాబ్ ఏరియాలో ఉన్న రింగ్ రోడ్డు వ‌ద్ద ఈ స్టేడియంను నిర్మించ‌నున్నారు. 2025 డిసెంబ‌ర్ నాటికి స్టేడియం నిర్మాణం పూర్త‌వుతుంది. ఈ స్టేడియంలోని గ్యాల‌రీని వార‌ణాసి ఘాట్‌ను త‌ల‌పించేలా డిజైన్ చేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్, ల‌ఖ్‌నౌలో రెండు అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. ఇప్పుడు మూడోదానికి కూడా శ్రీకారం చుట్టేసారు. (varanasi)

స్టేడియం ప్ర‌త్యేక‌త‌లు

30 వేల మందికి స‌రిపోయే సౌక‌ర్యం ఉంటుంది.

ఏకంగా 7 పిచ్‌ల‌ను డిజైన్ చేయ‌నున్నారు.

కాశీని త‌ల‌పించేలా డిజైన్ చేయ‌నున్నారు.

వార‌ణాసి ఘాట్స్‌లాగా గ్యాల‌రీలు ఉండ‌నున్నాయి.

త్రిశూలం ఆకారంలో ఫ్ల‌డ్ లైట్స్ ఏర్పాటుచేస్తారు.

కాశీ విశ్వ‌నాథుడిని సంబంధించిన సంగీత వాయిద్యం, ఢ‌మ‌రుకాన్ని పోలిన రూఫ్ డిజైన్ చేయ‌నున్నారు. (varanasi)

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం ప‌ర్యాట‌క రంగం భారీగా ప‌డిపోయింది. ఈ స్టేడియం ద్వారా డ్రైవ‌ర్లు, బోట్ రైడ‌ర్ల‌కు ఉపాధి క‌ల‌గ‌నుంది.