బాలయ్యను జైల్లో పెట్టొద్దని పురంధేశ్వరి YSR కాళ్లుపట్టుకుంది
BJP నేత పురంధేశ్వరిపై (purandeswari) సంచలన వ్యాఖ్యలు చేసారు పోసాని కృష్ణమురళి (posani). స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో అసలు ఏ స్కాం జరగలేదని YSRCP నడిపించినట్లుగానే AP CID నడుచుకుంటోందని పురంధేశ్వరి కొన్ని రోజుల క్రితం అన్నారు. దీనిపై పోసాని స్పందిస్తూ.. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లే ఆమెకు ఇలా జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేసే హక్కు లేదని అన్నారు.
“” అమ్మా పురంధేశ్వరి.. ఈరోజు మీ బావ చంద్రబాబు జైలుకి వెళ్తే తెగ బాధపడిపోతున్నావే. మేం శవాలపై పేలాలు ఏరుకునేవాళ్లామా? మరి నువ్వెవరు? ఇప్పటికే నువ్వు మూడు పార్టీలు మారావు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోతావు. అలాంటి నువ్వు మాపై కామెంట్స్ చేయడమా? పదవి కోసం కన్నతండ్రినే చంపేసే మీకు మేమెంతలే? మీ తమ్ముడు బాలకృష్ణ తుపాకీతో మనుషుల్ని షూట్ చేసినప్పుడు నీ తమ్ముడి కోసం YSR దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్లావు. గుర్తుందా తల్లీ? నా తమ్ముడు చెడ్డవాడే.. తుపాకీతో కాల్చి తప్పుచేసినవాడే.. అయినా సరే వాడు జైలుకి వెళ్లడానికి వీల్లేదు అని నువ్వు YSR దగ్గర మొరపెట్టుకుంటే ఆయన నీ కంట తడి చూడలేక మీ తమ్ముడిపై ఒక్క కేసు లేకుండా చేసాడు. అంతటి మహానుభావుడి బిడ్డను నువ్వు ఈరోజు నిలదీస్తున్నావా? “” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు పోసాని. (posani)