పేషంట్‌గా వచ్చి డాక్టర్‌ను దోచేసిన డెలివరీ బాయ్!
ఓ వ్యక్తి పేషెంట్ (patient) గెటప్‌లో వచ్చి ఏకంగా డాక్టర్నే దోచేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. దొంగతనం చేసి పారిపోతూ సారీ అని రాసిపెట్టి వెళ్లిపోయాడట. పెద్దార్ రోడ్డు ఏరియాలో ఓ క్లీనిక్ నడుపుతున్న 70 ఏళ్ల డాక్టర్ వద్దని నిన్న రాత్రి 23 ఏళ్ల అర్జున్ అనే వ్యక్తి పేషెంట్‌గా వచ్చాడు. ఇతను గతంలో స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అర్జున్ పేషెంట్‌గా 70 ఏళ్ల వ్యక్తి నడుపుతున్న క్లీనిక్‌కి వెళ్లాడు. తనకు ఒంట్లో బాగుండటం లేదని అన్నాడు. అక్కడే ఉన్న ఓ లేడీ డాక్టర్ అతనికి పరీక్షలు చేసి సెలైన్ ఎక్కించాలని చెప్పింది. ఆ తర్వాత అర్జున్ రూ.200 ఫీజు చెల్లించాడు. ఇప్పుడే వస్తాను అని ఆ డాక్టర్ తన క్యాబిన్ నుంచి పక్క రూంకి వెళ్లి రాగానే అర్జున్ కత్తితో ఆమెను బెదిరించి ఉన్న డబ్బంతా దోచుకునిపోయాడు. వెళ్లిపోతూ అక్కడే ఉన్న రసీదుపై సారీ అని రాసి వెళ్లిపోయాడు. ఈ రోజు ఉదయం ముంబై పోలీసులు అర్జున్‌ని అదుపులోకి తీసుకున్నారు.