Hardeep Singh Nijjar: ఇండియాపై ఎటాక్స్ ప్లాన్ చేసాడట
కెనడాలో (canada) జరిగిన గ్యాంగ్ వార్‌లో చనిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాది (khalistani terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్.. (hardeep singh nijjar) ఇండియాపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 1980 నుంచి ఇండియాపై దాడులు చేయాలని నిజ్జర్ కుట్రలు పన్నుతున్నాడు. ఇతను చిన్న వయసు ఉన్న పిల్లల్ని ఉగ్రవాదులుగా మారుస్తూ తన పనిలో పెట్టుకునేవాడు. 1996లో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడాలోకి ప్రవేశించి అక్కడ ఎవ్వరికీ అనుమానాలు రాకుండా ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయుధాల వాడకంలో శిక్షణ తీసుకునేందుకు అప్పుడప్పుడూ పాకిస్థాన్ వెళ్లి వచ్చేవాడు.
గతేడాది జూన్‌లో కెనడాలోని ఓ గురుద్వారా వద్ద జరిగిన దాడిలో నిజ్జర్ చనిపోయాడు. అయితే ఆ దాడి చేసిన వారిలో భారత రా ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ట్రూడో ఆరోపణలకు ఆధారాలు మాత్రం బయటపెట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం కెనడా ప్రభుత్వంపై ఇండియన్ ప్రభుత్వం కోపంగా ఉంది.