Atlee కోస‌మే ముంబై వెళ్లారా?

డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ..(atlee)  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని (allu arjun) క‌లిసారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న అట్లీ.. అక్క‌డే బ‌న్నీని క‌లిసి ఓ సినిమా క‌థ వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. బ‌న్నీ అట్లీని క‌ల‌వ‌డానికే ప్ర‌త్యేకంగా ముంబై వెళ్లార‌ని తెలుస్తోంది. డ్రామా, స‌స్పెన్స్‌తో హై బ‌డ్జెట్ సినిమా తీసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటివ‌ర‌కు ఒక్క ఫ్లాప్ లేని డైరెక్ట‌ర్ అట్లీ. ఇప్పుడు షారుక్ ఖాన్‌తో జ‌వాన్ సినిమా తీసి అత్య‌ధిక వ‌సూళ్లతో రికార్డుల వర్షం సృష్టించాడు.

ఏకంగా అంబానీల ఇంట్లో జ‌రిగే వినాయక చ‌వితి పండుగ‌కే అట్లీకి వారి నుంచి పిలుపు అందిందంటే.. ఈ త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ రేంజ్‌కి వెళ్లిపోయాడో అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ హిట్ మ్యాన్.. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కోసం ఎలాంటి సినిమా తీయ‌బోతున్నారో వేచి చూడాల్సిందే. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తారు. ఈ కాంబోలో సినిమా అంటే ఇప్ప‌టికే గూస్‌బంప్స్ వ‌చ్చేస్తున్నాయ్ క‌దూ..! (atlee)