Justin Trudeau: 50 ఏళ్ల చరిత్రలో చెత్త ప్రధాని…!
కెనడాలో (canada) ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోకి (justin trudeau) సపోర్ట్ తగ్గిపోతోంది. కెనడా 50 ఏళ్ల చరిత్రలో ఇలాంటి చెత్త ప్రధానిని తాము చూడలేదని కెనడా వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం ఆయన ఖలిస్తానీ సానుభూతిపరులకు కెనడాలో ఆశ్రయం కల్పించడమే మొదటి కారణం. 40 శాతం మంది కెనడియన్లు రాబోయే ఎన్నికల్లో ట్రూడోని కాకుండా బరిలో ఉన్న మరో అభ్యర్ధి పియర్ పోలివర్‌కే (Pierre Poilievre) సపోర్ట్ చేస్తున్నాట్లు ఇప్సోస్ పోల్ నివేదిక వెల్లడించింది.
ఇప్పటికిప్పుడు కెనడాలో ఎన్నికలు నిర్వహిస్తే ట్రూడోకి కేవలం 30 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని కానీ పియర్‌కి మాత్రం 39 శాతం ఓట్లు వస్తాయని నివేదికలో వెల్లడైంది. 2025లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. జస్టిన్ తండ్రి పియర్ ట్రూడో 1968 నుంచి 1979 వరకు ఒకసారి.. ఆ తర్వాత 1980 నుంచి 1984 వరకు మరోసారి కెనడా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. కెనడియన్ ఓటర్లు జస్టిన్ ట్రూడో తండ్రే ది బెస్ట్ ప్రధాని అని అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం మరోసారి జస్టిన్‌ను ఎన్నుకోమని స్పష్టం చేసారు.