KBC 15: ఆన్సర్ తెలిసీ.. రూ.7 కోట్లు వదులుకున్నాడు
ప్రముఖ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో (kbc 15) ఓ కంటెస్టెంట్ సమాధానం తెలిసీ రూ.7 కోట్లు వదులుకున్నాడు. అమితాబ్ బచ్చన్ (amitabh bachchan) హోస్ట్ చేస్తున్న KBC 15లోని 28వ ఎపిసోడ్‌ను ఇటీవల టెలికాస్ట్ చేసారు. ఈ ఎపిసోడ్లో పాల్గొన్న జస్నిల్ కుమార్ అనే వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో కోటి గెలుచుకున్న రెండో కంటెస్టెంట్ ఇతనే. ఈ సందర్భంగా ఎలా ఫీలవుతున్నారని అమితాబ్ జస్నిల్ను అడిగారు.
దాంతో జస్నీల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. “” సర్ నేను ఈ షోకి రావాలని 2011 నుంచి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను ఊపిరి తీసుకోవడం కంటే ఈ షోకి రావడం గురించే ఎక్కువ ఆలోచించానంటే మీరు నమ్ముతారా? ఎన్ని సార్లు ప్రయత్నించినా నా పేరు వచ్చేది కాదు. ఎంతో ఏడ్చాను. మా గల్లీలో ఉండేవారు నన్ను చూసి హేళన చేసేవారు. ఈసారి వస్తుందా అని నేను నా బిడ్డను అడిగితే తప్పకుండా వస్తుంది నాన్నా అని చెప్పాడు. నా బిడ్డ అంత గట్టిగా అనుకున్నాడు కాబట్టే నేను ఇక్కడికి రాగలిగాను “” అని కన్నీరుపెట్టుకున్నాడు.
ఆ తర్వాత అమితాబ్ రూ.7 కోట్ల ప్రశ్నను అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే.. లీనా గడే అనే తొలి మహిళా రేస్ ఇంజినీర్ ఏ రేసులో గెలిచారు అని అడిగారు. ఈ ప్రశ్నకు ఇండియానా పోలిస్, 24 హవర్స్ ఆఫ్ లేమాన్స్, 12 హవర్స్ ఆఫ్ సెబ్రింగ్, మొనాకో గ్రాండ్ ప్రి అని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు జస్నీల్కి కరెక్ట్ ఆన్సర్ తెలిసినప్పటికీ గెలుచుకున్న కోటి పోతాయేమోనని తెలీదు అని చెప్పి క్విట్ అయ్యాడు. అయితే ఆన్సర్ గెస్ చేయాలని అమితాబ్ అడగ్గా.. ఆప్షన్ బి 24 హవర్స్ ఆఫ్ లేమాన్స్ అని చెప్పాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అని అమితాబ్ చెప్పడంతో అతను మరింత కుంగిపోయాడు. పాపం అలా సరైన ఆన్సర్ తెలిసినప్పటికీ రిస్క్ ఎందుకులే అని రూ.7 కోట్లు వదులుకున్నాడు. (kbc 15)