Meera Funeral: 9 నెలలు మోసా.. నాతో చెప్పుకోలేకపోయావా తల్లీ..
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (vijay antony) కూతరు మీరా (meera funeral) ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మీరా.. నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మీరా కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోందని కుటుంబీకులు చెప్తున్నారు. కాగా.. ఈరోజు మీరా అంత్యక్రియల సమయంలో ఆమె తల్లి ఫాతిమా కన్నీరుమున్నీరయ్యారు. తొమ్మిది నెలలు మోసి కన్నాను తల్లీ నిన్ను.. నీ బాధను నాతో చెప్పుకోలేకపోయావా అంటూ ఆమె ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి తరం కాలేదు. విజయ్ కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు తమిళ చిత్ర పరిశ్రమ కదిలి వచ్చింది. విశాల్, శరత్ కుమార్, సింబు, కార్తి, రాఘవ లారెన్స్‌లతో పాటు మన తెలుగు వారు దేవిశ్రీ ప్రసాద్, నటి సుధ కూడా విజయ్ నివాసానికి చేరుకున్నారు. (meera funeral)