Nagarjuna: నాన్న విగ్రహం చూడాలని అనిపించలేదు
దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు (anr lives on) శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆవిష్కరించారు. నాగేశ్వరరావుకి.. ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వెంకయ్య నాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. తనకు మాత్రం నాన్న విగ్రహం చూడాలని అనిపించలేదని అన్నారు అక్కినేని నాగార్జున (nagarjuna). చిన్నప్పటి నుంచి ఎక్కడ ఏ విగ్రహం చూసినా కూడా ఆ మనిషి లేడు కాబట్టే విగ్రహాన్ని పెట్టారు అనిపించేదని.. ఇప్పుడు తన తండ్రి విగ్రహాన్ని చూస్తే ఎక్కడ ఆయన తనతో పాటు లేరు అన్న నిజాన్ని మనసు తట్టుకుంటుందో లేదోనని విగ్రహాన్ని చూడకూడదు అనుకున్నానని అన్నారు. వెంకయ్యనాయుడు విగ్రహావిష్కరణ చేసాక తన తండ్రి విగ్రహాన్ని చూసి జీవం ఉట్టిపడేలా తయారుచేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. (nagarjuna)
ఇది నా అదృష్టం
“” ఎవరు ఎవరికి పుట్టాలనేది డిసైడ్ చేసుకోలేం. నేను ANR మనవడిగా ఈ ఇంట్లో పుట్టినందుకు ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. తాతగారు నేర్పినవి జీవితాంతం గుర్తుంచుని పాటిస్తాను “” అని తెలిపారు నాగచైతన్య (naga chaitanya)
ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ బాలేదు
ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ తీస్తున్న కొన్ని సినిమాలు బాగాలేవని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. తెలుగు భాషపై ఉన్న పట్టు ఇప్పుడున్న వారిలో ఏ ఒక్కరికీ లేదని తెలిపారు. తెలుగు భాషలో చక్కని పదాలతో డైలాగులు చెప్పేవారని.. కానీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు తప్ప ఏమీ ఉండటం లేదని అన్నారు. అలాంటి డైలాగులు పెట్టకపోయినా సినిమా నడుస్తుందని అన్నారు.