Narendra Modi: ఈ ప‌నికి దేవుడు న‌న్నే ఎంచుకున్నాడు

ఎన్నో ఏళ్లుగా ఎంద‌రో ప్ర‌ధాన మంత్రులు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును (women’s reservation bill) ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూసినా కూడా వారి వ‌ల్ల కాలేద‌ని.. ఇప్పుడు త‌న వ‌ల్ల అయ్యిందంటే.. అందుకు కార‌ణం దేవుడు త‌న‌ను ఎంచుకోవ‌డ‌మేన‌ని అన్నారు ప్ర‌ధాని నరేంద్ర మోదీ (narendra modi). కేవ‌లం మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడ‌గానే స‌రిపోదని వారి హ‌యాంలో అభివృద్ధి అనేది కూడా జ‌రిగితేనే దేశం బాగుప‌డుతుంద‌ని మోదీ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో తెలిపారు. అయితే.. ప్ర‌తిప‌క్షాల వాద‌న మ‌రోలా ఉంది. ఇన్నేళ్లుగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వ్య‌తిరేకిస్తూ వ‌చ్చింది మోదీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఇంకొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు వస్తున్న నేప‌థ్యంలో ఓట్ల కోసం ఇప్పుడు ఆమోదం తెలిపింద‌ని ఆరోపిస్తున్నారు.