Malla Reddy: చంద్రబాబుది అక్రమ అరెస్టే..!
TDP అధినేత చంద్రబాబు నాయుడుది (chandrababu naidu) అక్రమ అరెస్టేనని అన్నారు BRS మంత్రి మల్లారెడ్డి (malla reddy). ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేయించిందని దీనిని తాను ఖండిస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ సీఎం KCR, మంత్రి KTRలు ఎందుకు స్పందిచలేదు అని అడగ్గా.. వారి సంగతి తనకు తెలీదు కానీ తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించగలనని అన్నారు.