Varun Lavanya: జంట‌గా తొలి పండుగ‌..!

కాబోయే దంప‌తులు వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిలు (varun lavanya) వినాయ‌క చ‌వితిని (vinayaka chavithi) క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. నాగ‌బాబు నివాసంలో వ‌రుణ్‌, లావ‌ణ్య‌ల చేత ఘ‌నంగా పూజ చేయించారు. నాగ బాబు తన భార్య ప‌ద్మజ‌తో.. వ‌రుణ్ త‌న‌కు కాబోయే భార్య లావ‌ణ్య‌తో క‌లిసి దిగిన ఫోటోను వ‌రుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇక న‌వంబ‌ర్‌లో ఘ‌నంగా వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. ఇందుకోసం హైద‌రాబాద్‌లోని మ‌నీష్ మల్హోత్రా ద‌గ్గ‌ర పెళ్లికి కావాల్సిన దుస్తుల‌ను ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. (varun tej lavanya tripathi marriage)