Naga Chaitanya: త్వరలో పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తారట..!
నాగచైతన్య (naga chaitanya) రెండో పెళ్లి గురించి రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన గురించి షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది. నటి శోభిత ధూలిపాలతో (sobhita dhulipala) ఇప్పటికీ డేటింగ్‌లోనే ఉన్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. వారు ఇప్పటికీ కలిసే ఉన్నారని అంటున్నారు. త్వరలో తమ రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా అనౌన్స్ కూడా చేసేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. మరోపక్క నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలని ఆయన అమ్మ లక్ష్మి అనుకుంటున్నారు. సమంతతో విడాకులు అయ్యాక మళ్లీ సినిమా రంగానికి చెందిన అమ్మాయితో కాకుండా బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో చై పెళ్లి చేయాలని ప్లాన్ వేస్తున్నారని టాక్ నడుస్తోంది.
గత ఏడాది శోభిత, నాగ చైతన్య కలిసి లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఇండియన్ చెఫ్‌తో ఫోటో దిగడంతో అది వైరల్‌గా మారింది. అప్పుడే వీరిద్దరూ డేటింగ్‌లోఉన్నారన్న టాక్ మొదలైంది. ఇదే విషయం గురించి నాగ చైతన్యను అడిగితే.. నవ్వి ఊరుకుంటాను అన్నాడు. శోభితను అడిగితే.. నా పర్సనల్ విషయాలు నేనెందుకు బయటపెట్టాలి అన్నారు. సో త్వరలో వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ని అఫీషియల్ చేయాలని అనుకుంటున్నారని శోభిత, చై సన్నిహిత వర్గాలు మీడియా ద్వారా వెల్లడించాయి. (naga chaitanya)