Congress Vijayabheri: తెలంగాణకు సోనియమ్మ హామీలు
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు హైదరాబాద్లోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి (congress vijayabheri)సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద ఆడవారికి రూ.2500, మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సిలిండర్ రూ.500కే ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆరు హామీలు నెరవేర్చబోతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలివే
మహాలక్ష్మి పథకం
ప్రతి తెలంగాణ ఆడపడుచుకి మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఖాతాలో వేయనున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు
ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల సాయం ప్రకటించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నారు.
యువ వికాసం
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషన్ పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. (congress vijayabheri)
చేయూత
వితంతువులు, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.
గృహ జ్యోతి
ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
రైతు భరోసా
ప్రతి రైతుకు ఎకరాకు ప్రతి ఏటా రూ.15,000 ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (mallikarjun kharge) ప్రకటించారు. ఇది కౌలు రైతులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. దాంతో పాటు భూమి లేని ప్రజలకు రైతు కూలీలకి ఏడాదికి రూ.12,000 ఖాతాలో వేస్తామని తెలిపారు. వరి పండించే రైతులకు క్వింటాల్కి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్
అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం మాటలే కానీ చేతలు ఏవీ లేవని అన్నారు. గతంలో సోనియా ప్రత్యేక తెలంగాణ ఇస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రజలకు ఇచ్చారని తెలిపారు. బయటికి BJP, BRS శత్రువులుగా వ్యవహరిస్తున్నారు కానీ.. లోపల ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని తెలిపారు. ఓ పక్క BJP, మరోపక్క BRS తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. (congress vijayabheri)