Niharika పంచుకున్న పెళ్లి కబుర్లు..!
త్వరలో మెగా ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (varun tej).. నటి లావణ్య త్రిపాఠిల (lavanya tripathi) వివాహం నవంబర్‌లో జరగబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ చెల్లెలు నిహారిక (niharika) చెప్పిన పెళ్లి కబుర్లు ఇవే..!
“” నేను నా ఫ్యామిలీ ఇటీవల కెన్యాకు వెళ్లాం. కెన్యాకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే టైం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వాళ్లు ఇండియా వెళ్లిపోయారు కానీ నేను అమెరికాలో నా ఫ్రెండ్స్‌తో ఉన్నాను. ఎందుకంటే నా చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని వెబ్‌సిరీస్‌లను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఒక సినిమాను కూడా ఓకే చేసాను. కాబట్టి నాకు ఒక 20 రోజులు బ్రేక్ కావాలి. అందుకే అమెరికాకి వచ్చాను. ఇక అన్నయ్య పెళ్లి గురించి చెప్పాలంటే పెళ్లి ఎక్కడ అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. త్వరగా వచ్చేయ్ పెళ్లి పనులు ఉన్నాయని అన్నయ్య రోజూ ఫోన్ చేస్తున్నాడు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. లావణ్య అన్నయ్య ప్రేమలో పడకముందే నాకు తను మంచి ఫ్రెండ్. తను ఎప్పుడూ ఫన్నీగా ఉంటుంది. వాళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్“” అని తెలిపారు (niharika)